వరంగల్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు. మోదీ తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. మోదీ ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. మోడీ దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలే నని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు… కాంగ్రెస్,బి ఆర్ ఎస్ పార్టీలపై విమర్శలు చేసారు….బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రధానిని తిట్టడానికే ఎక్కువ ప్రాధన్యత ను ఇస్తూ అభివృద్ధి మరిచిపోయారని అన్నారు…ఎక్కడ ప్రాజెక్టులు కట్టిన అవినీతి తప్ప ఏమీ లేదన్నారు…కుటుంబ పాలన కొనసాగిస్తున్న బి ఆర్ ఎస్ సర్పంచ్ లను ఇబ్బందులు పెడుతుందని వారు సైతం బి ఆర్ ఎస్ సర్కార్ పై కోపంగా ఉన్నారని అన్నారు మోదీ…తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు ట్రైలర్ చూపించామని త్వరలో తెలంగాణాలో అధికారం ఖాయమన్నారు….బి ఆర్ ఎస్ సర్కార్ నిరుద్యోగుల ను సైతం మోసం చేసిందని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాలను మొత్తం మరిచిపోయిందన్నారు.
ఈ కార్య్రమానికి బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమెందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి నితిన్ గట్కారి మాట్లాడుతూ 9సంవత్సరాల బీజేపీ పాలనలో దేశ రాష్ట్ర లను కలుపుతూ 4లైన్, 6లైన్ రహదారులు నిర్మాణం చేపట్టి నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *