జూలై లో వరంగల్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్నారు. జిల్లాలోడెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న మోడీ అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు బిజెపి భారీ ఏర్పాట్లు చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జులై 8నాటి ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు అదే రోజు హైదరాబాద్ లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం తేదీలు త్వరలో ప్రకటిస్తామని బిజెపి వర్గాలు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *