చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోనే ప్రభుత్వంతో కయ్యానికే కాలు దువ్వుతున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీపై భర్తరఫ్ వేటు వేశారు. అయితే గంటల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్నారు. మంత్రి వి.సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే మంత్రిపై వేటు వేసిన గవర్నర్ హఠాత్తుగా తన మనసు మార్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాజ్ భవన్ నుంచి సెంథిల్ భర్తరఫ్ ప్రకటన వెలువడిన గంటల్లోనే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తన అనుమతి లేకుండా ఒక మంత్రిని భర్తరఫ్ చేసే అధికారాలు గవర్నర్ కు లేవని సిఎం స్టాలిన్ కుండబద్ధలు కొట్టారు.  ప్రభుత్వ నిర్ణయంతో పునరాలోచనలో పడ్డ గవర్నర్ రవి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్టయిన సెంథిల్ బాలాజీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే గవర్నర్ నిర్ణయంతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తొందరపడి నిర్ణయం తీసుకోవడమెందుకు.. ఇలా తిరిగి వెనక్కి తీసుకోవడం ఎందుకున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *