న్యూఢిల్లీ : తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారంనాడు ఉదయమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా రేవంత్ కలిసి వారిని తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. తనపై నమ్మకం ఉంచి సీఎం పదవిని అప్పగిస్తున్నందుకు రేవంత్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం పెద్దలతో కూడా రేవంత్ చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *