ఆహ్మదాబాద్ : తల్లి ప్రేమ తల్లి ప్రేమే.. దానికి ఎవరూ సాటిరారు. ఏ విధుల్లో ఉన్నా.. ఏ చోట ఉన్నా చట్టి పిల్లలకు తమను ప్రేమ ఆప్యాయతలను పంచగలరు. చంటిపిల్లలను ఎలా చక్కబెట్టాలో వాళ్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు. గుజరాత్ లో ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లోనూ మరో తల్లి బిడ్డను ముద్దు చేసి ఆమెకు సాయపడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. గుజరాత్ హైకోర్టులో ప్యూన్ పోస్టులకు ఆదివారంనాడు రాత పరీక్ష నిర్వహించారు. ఓదవ్ లో పరీక్షకు ఓ తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో తన పాపతో రావాల్సి వచ్చింది. లోపలికి తీసుకెళ్లేందుకు నిబంధనలు ఒప్పుకోకపోవడంతో కానిస్టేబుల్ దయా బెన్ ఆరు నెలల పాప ఆలనాపాలనా బాధ్యతను తీసుకుంది. పాప తల్లి పరీక్ష రాసేవరకు ఆటపాటలతో ముద్దు చేసింది. చివరకు తల్లికి పాపను అప్పజెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *