న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వేర్వేరుగా ప్రత్యేక లేఖలు రాశారు. పార్లమెంట్ లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల పక్షాన నిలబడినందుకు ఆప్ తరపున అభినందలు చెప్పారు. ఢిల్లీ వాసుల హక్కుల రక్షణకు పార్లమెంట్ బయట, లోపల అండగా నిలిచారని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై పోరాటంలో కాంగ్రెస్ కు ఆప్ ఎల్లప్పుడూ బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *