వరంగల్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణం, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనులకు పచ్చ జెండా ఊపారు. రూ.3441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ బహిరంగ సభలో
మోడీ ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి దేశ రాజధాని ఢిల్లీకి పాకిందన్నారు. భద్రకాళి, సమ్మక్క సారలమ్మ, రుద్రమదేవి పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్ కు రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందన్నారు. తొలి సారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయన్నారు. కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *