భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్క్ లో మరో చీతా మరణించింది. నాలుగు నెలలో ఇది ఏడో మరణం. ఉదయం చీతాను గుర్తించిన మానిటరింగ్ టీమ్ దానిపై గాయాలు ఉన్నట్లు గమనించారు. మెడ చుట్టూ గాయాలయ్యాయి. వైద్యుడిని సంప్రదించిన సిబ్బంది దానికి చికిత్స చేయించినా లాభం లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు చనిపోయినట్లు వెల్లడించారు. పంచనామా తర్వాతే చీతా మరణానికి కారణాలు చెప్పగలమని కునో పార్క్ చీఫ్ కన్జర్వేటర్ జెసి చౌహాన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *