న్యూఢిల్లీ :  దేశం కోసం వాళ్లేమీ చేయరు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే అని ఉంటాయి. కానీ కుటుంబ పార్టీల్లో మాత్రం కుటుంబాల చేత.. కుటుంబాల కోసమే.. కుటుంబాల కొరకే అని ఉంటుందని కుటుంబ పార్టీలపై (విపక్షాలు) ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ కు సంబంధించిన నూతన టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కుటుంబ పార్టీలక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.  ఈ తొమ్మిదేళ్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దినట్లు పేర్కొన్నారు. ఇక కేవలం కుటుంబాల కోసమే పనిచేసే కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అభివృద్ధి అనే మాటెత్తకుండా, కేవలం వారి స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాయని విమర్శించారు. దేశ ప్రజలు తమని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అది తెలిసే విపక్షాలు బెంగళూరులో దుకాణాలు పెట్టాయన్నారు. ’24కేలియే 26 హోనే వాలే రాజనైతిక్‌ దలోన్‌ పర్‌ యే బడా ఫిట్‌ బైతా తాహై అంటూ పాటలు పాడుతున్నాయని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *