న్యూఢిల్లీ : ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారంనాడు మధ్యాహ్నం సమయంలో అత్యవసర వార్డులోని ఎండోస్కోపీ గది నుంచి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. దీంతో హుటాహుటిన రోగులను, సిబ్బందిని మరో గదికి సురక్షితంగా తరలించారు. రెండో అంతస్థులోని ఓల్డ్ ఔట్ పేషెంట్ విభాగం పక్కనే ఉన్నాయి. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్ని మాపక శాఖ ఆరు వాహనాలతో తరలివచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా కొంత మేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *