న్యూఢిల్లీ : విపక్షాల సమావేశాలతో అధికార బీజేపీలో కదలిక వచ్చింది. 18న జరగబోయే బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సమావేశానికి లోక్ జనశక్తి పార్టీకి ఆహ్వానం అందింది. ప్రతిపక్ష పార్టీలకు దీటుగా సమావేశం కావాలని భాగస్వామ్య పక్షాలను కలుస్తోంది. అందులో భాగంగానే శనివారంనాడు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ జనశక్తి (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ను కలిసి ఆహ్వానం పలికారు. వారం రోజుల్లో ఆయన చిరాగ్ ను కలవడం ఇది రెండో సారి. పేద ప్రజల సంక్షేమం, డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లడంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ప్రాంతీయ పార్టీ లోక్ ఎల్జేపీది కూడా కీలక పాత్ర అని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *