న్యూఢిల్లీ కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డీఏ)పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో మణిపూర్‌ అంశంపై సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నసంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంశంపై ఇండియా కూటమి పార్టీలు చర్చించుకున్నాయని, ఈ ప్రతిపాదన అందులోనే వచ్చిందని తెలుస్తోంది. మణిపూర్‌ అంశంపై కేంద్రాన్ని లక్ష్యం చేసుకోవాలంటే రాజ్యసభలో అవిశ్వాస తీర్మానంవైపే మొగ్గు చూపాలని సూత్రపాయంగా నిర్ణయించుకున్నట్లు పిటిఐ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. 83 రోజులుగా మణిపూర్‌ మండిపోతుంటే ప్రధానమంత్రి సమగ్ర ప్రకటన పార్లమెంట్‌లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ జరుగుతు అకృత్యాల గురించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *