న్యూఢిల్లీ : ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేని వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు పాటు ఇదే తరహాలో వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్ , జమ్మూ కశ్మీర్ లలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 9మంది దుర్మరణం చెందారు. మరోవైపు కొండచరియలు విరిగిపడడంతో అమర్ నాథ్ యాత్ర మూడో రోజూ నిలిపివేశారు. సైన్యం సాయంతో రహదారి పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఇవి ముగిసిసిన వెంటనే పరిస్థితిని సమీక్షించి యాత్రకు తిరిగి అనుమతి ఇవ్వనున్నారు. ఇక రాజధాని ఢిల్లీలో రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. సీఎం కేజ్రీవాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. 1982 తర్వాత ఇంత భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తడం ఇదే మొదటిసారి అని ఐఎండీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *