బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17-18 తేదీల్లో జరగనున్న విపక్షాల సమావేశానికి ఒక కీలక వ్యక్తి హాజరుకాబోతున్నారు. ఆమె ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. ఈ సమావేశానికి 24 పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఎఎన్ఐ వర్గాలు వెల్లడించాయి. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న విపక్షాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బెంగళూరు సమావేశంలో ఆయా పార్టీల నడుమ ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సమావేశానికి కొత్తగా ఎండిఎంకె, కెడిఎంకె, విసికె, ఆర్ఎస్పి, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్(జోసెఫ్), ఫార్వర్డ్ బ్లాక్, కేరళ కాంగ్రెస్ (మణి) తదితర పార్టీలకు కూడా ఈ సారి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. పాట్నా లో జరిగిన తొలి సమావేశంలో 15 పార్టీలు హాజరై బిజెపికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని సూచనప్రాయంగా నిర్ణయించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *