బెంగళూరు : ఈ రోజు రాత్రి ఇస్రో చంద్రయాన్-3 మిషన్ కీలక దశకు చేరుకోనుంది. ప్రయోగం జరిపి 15 రోజులు ముగుస్తుంది. ఇప్పటి వరకు భూ కక్ష్యలోనే తిరిగిన చంద్రయాన్-3 అంతా సవ్యంగా సాగితే ఇక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇంతటి కీలక దశకు ఇస్రో సోమవారంనాడు రాత్రి శ్రీకారం చుట్టబోతోంది. అర్ధరాత్రి 12-1.00 నడుమ 28 నుంచి 31 నిమిషాల పాటు వాహకనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ ఇంజిన్ లను మండిస్తుంది. దీన్నే క్లిష్టతరమైన ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్(టిఎల్ఐ) అంటారు. తద్వారా స్పేస్ క్రాఫ్ట్ వెలాసిటీని శాస్త్రవేత్తలు పెంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *