శ్రీహరికోట  : ఇస్రో ఈ రోజు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.  డీఎస్ సార్ ఉపగ్రహంతో పాటు మరో 6 నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 23 నిమిషాల తర్వాత ఏడు ఉపగ్రహాలు నిర్దిష్ట కక్ష్యలోకి చేరాయి.  ఇస్రో వాణిజ్య పరమైన ఒప్పందాల తోనే పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగం నిర్వహించింది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలలో సింగపూర్ కు చెందిన డీఎస్ సార్ ఉపగ్రహం ప్రధానమైనది కాగా దాంతో పాటుగా వేలోక్స -ఏం , ఆర్కేడ్ ,  స్కూబీ -2 ,  న్యూ లైన్ , గాలాసియా -2 , ఓఆర్బీ-12 స్త్రీడర్ ఈ నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. ప్రయోగం విజయవంతంగా కావడంతో ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. పీఎస్ఎల్వీ సిరీస్ లో మరో విజయాన్ని నమోదు చేసుకుంటున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *