చండీగఢ్ : ఎమ్మెల్యే చెంప చెల్లుమంది. వరదలో ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకునేందుకు వచ్చిన హర్యానకు చెందిన జననాయక జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ బుధవారంనాడు గులా ఏరియాకు వెళ్లారు. తమ ఏరియాలో చిన్న
డ్యామ్ నిర్మించడమే ఈ ప్రాంతం మునిగిపోవడానికి కారణమని, ఆ విషయంలో ఎమ్మెల్యే పట్టించుకోకపోవడమే ప్రస్తుత తమ దుస్థితికి కారణమని మండిపడుతూ ఓ హిళా శాసనసభ్యుడిపై చెంపపై చేయి చేసుకుంది. స్థానికులంతా ఎమ్మెల్యే
చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురిపిస్తుండగానే సహనం కోల్పోయిన ఓ మహిళ హఠాత్తుగా చేయి విదిల్చింది. అయితే జెజెపి ఎమ్మెల్యే ప్రస్తుతం బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *