కోల్ కతా :  ‘ఇండియా’ కూటమిలో క్రమంగా అసమ్మతి గొంతుకలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6న జరగబోయే కూటమి సమావేశం గురించి తనకు సమాచారం లేదని వ్యాఖ్యానించారు. సోమవారంనాడు ఇక్కడి అసెంబ్లీ భవంతిలో మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ రోజు తనకు ఉత్తర బెంగాల్ లో అధికారిక కార్యక్రమాలున్నాయని, ఒకవేళ కూటమి సమావేశం గురించి తెలిసివుంటే అలాంటి కార్యక్రమాలు పెట్టుకునే వాళ్లం కాదు కదా అని ఎఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాత్రం కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చామని చెప్పారు. దానికి విరుద్ధంగా మమత ప్రకటన చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *