న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపిలేని వానలు, కొండచరియలు విరిగిపడుతుండడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
బతుకుతున్నారు. సోమవారంనాడు హిమాచల్ ప్రదేశ్ లో 16మంది దుర్మరణం చెందారు. సోలాన్, షిమ్లా సిటీలో ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. కందఘాట్ జిల్లాల్లో ఆరుగురిని రక్షించారు. రెండు ఇళ్లు, మరో
ఆవుల కొట్టం పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఆదేశాలిచ్చారు. ఎడతెరిపి లేని వానల కారణంగా విద్యాసంస్థలను మూసివేశారు.
జరగాల్సిన పీజీ, బీఈడీ పరీక్షలను వాయిదా వేశారు. కొండచరియలు విరిగిపడుతుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మరోవైపు వరదల ధాటికి ఉత్తరాఖండ్ కూడా అతలాకుతలం అవుతోంది. డెహ్రాడూన్ లోని
మాల్డెట్వా లోని డిఫెన్స్ కాలేజీ కుప్పకూలిపోయింది. వరదలో కొట్టుకుపోయింది. బందాల్ నది ఉప్పొంగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉత్తరాఖండ్ కు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇటీవల వర్షాలతో
ఉత్తరాఖండ్ లో 17 మంది గల్లంతయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *