లక్నో న్యూఢిల్లీ  : వారణాసిలోని జ్ఖానవాపి మసీదు లో భారత పురావస్తు శాఖ టీమ్ శాస్త్రీయ సర్వే అర్ధాంతరంగా సుప్రీంకోర్టు నిలిపివేసింది. అందులో ఒక్క ఇటుక ను కూడా పెకిలించడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు సర్వేపై స్టే విధించింది. ఎఎస్ఐ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిండంతో పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు అంతకుముందు సోమవారంనాడు  ఉదయం ఏడు గంటలకే ఎఎస్ఐ టీమ్ మసీదుకు చేరుకుని ఆ ఏరియాను మొత్తం సీల్ చేశారు. ఊజుఖానా మిగత ప్రాంతానంతా తమ పరిధిలోకి తీసుకున్నారు. అయితే సుప్రీం ఆదేశాలతో సర్వే నిలిచిపోయింది. మరోవైపు మసీదు నిర్వహణ కమిటీ ఈ సర్వేను పూర్తిగా బాయ్ కాట్ చేసింది. కమిటీలోని ఏ ఒక్క సభ్యులూ సర్వేకు హాజరుకాలేదని మజీదు కమిటీ జాయింట్ సెక్రెటరీ సయ్యద్ మహ్మద్ తెలిపారు. ఎఎస్ఐ తన నివేదికను వచ్చే నెల 4నాటికి వారణాసి జిల్లా న్యాయస్థానికి సమర్పించనుంది. గత శుక్రవారంనాడు కోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ శాస్ర్తీయ సర్వే ప్రారంభమైంది. పురాతన హిందూ దేవాలయంపై మసీదు నిర్మించారని, అందులో శివలింగం ఉందని, తమకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని నలుగురు మహిళా భక్తులు వేసిన పిటిషన్ మేరకు వారణాసి కోర్టు నిజాలు నిగ్గు తేల్చేందుకు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. దాని ప్రకారం సోమవారంనాడు సర్వే మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికంగా భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *