న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ నిబంధన అనేది తాత్కాలిక ఏర్పాటు కోసం చేసుకున్నదే కానీ శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చలేమని కుండబద్ధలు కొట్టింది. ఆయన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టతనిచ్చింది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొన్ని మాసాలుగా దర్యాప్తు జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సోమవారంనాడు తుదితీర్పును వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసంన తీర్పును వెల్లడించింది. జమ్మూ కశ్మర్ లో వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికల్లా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 370 అనేది అప్పట్లో యుద్ధ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తాత్కాలికంగా ప్రవేశపెట్టిన నిబంధనేని వ్యాఖ్యానించింది. జమ్మూ కశ్మీర్ కేంద్రం తీసుకున్న ప్రతినిర్ణయాన్ని సవాల్ చేయలేరని, భారత్ లో విలీనం తర్వాత ఆ రాష్ర్టానికి ప్రత్యేక సార్వభౌమాధికారం అనేది ఉండబోదని తేల్చి చెప్పింది. మిగతా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని కీలక వ్యాఖ్య చేసింది.
ఆ విభజన కూడా సమంజసమే…
జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించడం, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా న్యాయస్థానం వెనకేసుకొచ్చింది. అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించింది. ఇదిలావుండగా ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. వెంటేనే రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ అక్కడి పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అప్పటి నుంచి చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తూ వచ్చింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వులో పెట్టింది. సోమవారంనాడు తుది తీర్పు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *