న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు కీలక నిర్ణయం వెలువరించింది. ఆగస్టు నుంచి 2 నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 2 ఉదయం 10.30 గంటల నుంచి సుప్రీం ధర్మాసనం ఎదుటకు పిటిషన్లు వస్తాయి అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, సూర్యకాంత్ ఇతర సభ్యులు ధర్మాసనంలో ఉన్నారు. ఇదిలావుండగా 370 ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన షీలా రషీద్, షా ఫైజల్ వాటిని ఉపసంహరించుకున్నారు. వీరిలో ఫైజల్ ఐఎఎస్ అధికారి కాగా, రషీద్ జెఎన్ యూ విద్యార్థిని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *