న్యూఢిల్లీ : మణిపూర్ లో జాతుల ఘర్షణపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం చర్చ ఎప్పుడనే సస్పెన్స్ కు తెర పడింది. వచ్చే వారం అంటే ఆగస్టు 8,9,10 తేదీల్లో లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు మంగళవారంనాడు వెల్లడించాయి. చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన జూలై 20 నుంచి మణిపూర్ అంశంపై పార్లమెంట్ సమావేశాలపై ప్రతిష్టంభన నెలకొంది. విపక్షాల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రకటించినప్పటికీ విపక్షాలు ససేమిరా అన్నాయి. మోడీ ప్రకటనకే పట్టుబడుతూ వస్తున్నాయి. ఇటీవల ‘ఇండియా’ కూటమి కూడా మణిపూర్ లో పర్యటించి వచ్చింది. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసింది. మరోవైపు 50 మంది సభ్యుల సంతకాలతో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఇఠీవల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 543 మంది సభ్యులున్న దిగువసభలో అధికార పక్షానికి 331 మంది సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి 144మంది మద్దతు ఉంది. ఈ కారణంగా ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం వీగిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *