భారత స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో విరాట్ (121) పరుగులు సాధించి తన ఖాతాలో మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీకి ఒక విశేషం ఉంది. సరిగ్గా 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ శతకం బాదడం అభిమానులు ఆనందానికి గురి చేసింది. తాజా టెస్ట్ సెంచరీతో అన్మి రకాల ఫార్మాట్లలో కలిపి కోహ్లీ శతకాల సంఖ్య 76 కు చేరింది. సచిన్ టెండూల్కర్ ను విరాట్ అధిగమించాడు. సచిన్ 500 మ్యాచ్ లో 75 సెంచరీలు బాదగా… విరాట్ 76 శతకాలతో అజేయంగా కొనసాగుతున్నాడు. మరోవైపు 500వ మ్యాచ్ లో శతకం సాధించిన ఏకైక ఆటగాడిగా కూడా విరాట్ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు విరాట్ శతకం సందర్భంగా ఆయన భార్య అనుష్క ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *