ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో నిలిచింది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు కరేబియన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే జట్టు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 181 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (52) పరుగులు అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో 365 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. సోమవారం చివరి రోజు కావడంతో భారత్‌ గెలుపునకు 8 వికెట్లు.. విండీస్‌ గెలుపునకు 289 పరుగులు అవసరం కానున్నాయి. అయితే ప్రస్తుతం వెస్టిండీస్‌ ఫాం చూస్తే టీమిండియా విజయం ఖరారైనట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *