న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మన సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యుడబ్ల్యు) బుధవారంనాడు రాత్రి ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని గురువారంనాడు భారత రెజ్లింగ్ సమాఖ్య వెల్లడించింది. సమాఖ్య ఎన్నికల నిర్వహణలో డబ్ల్యుఎఫ్ఐ ఘోరంగా విఫలమైందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో భారత రెజ్లర్లు రాబోయే ప్రపంచ చాంపియన్ షిప్ లో దేశం తరపున ఆడడం ఇక కష్టమే. సెప్టెంబర్ 16 నుంచి ప్రపంచ చాంపియన్ షిప్ జరగబోతోంది. అయితే భారత రెజ్లర్లు తటస్థ అథ్లెట్లు’ గా పోటీ పడాల్సి వస్తుంది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో భారత ప్యానెల్ ను ఐఓఏ రద్దు చేసింది. ఆ తర్వాత 45 రోజుల్లో డబ్ల్యుఎఫ్ఐ ప్యానెల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరించినా ఆ పని సకాలంలో చేయలేకపోవడంతో వేటు ఎదుర్కొనాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *