కొరియా ఓపెన్ టైటిల్ ను భారత్ వశమైంది. సాత్విక్-చిరాగ్ జోడీ ప్రపంచ నెంబర్ వన్ ఇండొనేషియా జోడీపై ఆదివారంనాడు జరిగిన ఫైనల్ లో చిరస్మరణీయ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. అర్డియాంటో-ఫజర్ అల్ఫియాన్ జోడీపై 17-21, 21-13,21-14 తేడాతో భారత జంట ఘన విజయాన్ని నమోదుచేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. ప్రపంచ నెంబర్ టూ చైనా జంట లియాంగ్-వాంగ్ చాంగ్ జోడీపై శనివారంనాడు విజయం సాధించి ఫైనల్ లోకి చిరాగ్-సాత్విక్ జోడీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఫైనల్ లో తొలి సెట్ కోల్పోయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రెట్టించిన ఉత్సాంగా భారత జోడీ వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. చిరాగ్ జంటపై భారత్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *