రోసి : అరంగేట్రం మ్యాచ్ లోనే ఆ కుర్రాడు అదరగొట్టాడు. తొలి మ్యాచ్ లోనే శతకం బాది సత్తా చాటాడు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. అతడే యశస్వీ జైశ్వాల్. రోసీలో వెస్టిండీస్ తో జరుగుతున్న అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో శెభాష్ అనిపించుకున్నాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాట్ కు పనిచెప్పాడు. కరేబియన్ బౌలర్లపై చెలరేగి శతకం కొట్టాడు. రెండో రోజూ ఆటముగిసే సమయానికి 86 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 261 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజుల కోహ్లీ(7), యశస్వీ(124) ఉన్నారు. భారత్ 111 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రోజైన బుధవారంనాడు చివరి సెషన్ లో బ్యాటింగ్ ఆరంభించిన భారత బ్యాటర్లు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించి పెట్టారు. రోహిత్, యశస్వీ విండీస్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. యశస్వీ ఆటతీరు చూస్తుంటే అరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న భావనే రానీయలేదు. ఇక రెండో సెషన్ లో భారత్ ఆట జోరందుకుంది. రోహిత్, యశస్వీ అవకాశం చిక్కినప్పుడల్లా కరేబియన్ బౌలర్లపై విరుచుపడుతూ స్కోర్ పెంచారు. వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ ఆరు పరుగులకే వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో అథనజె, వారికన్ లకు చెరో వికెట్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *