వాషింగ్టన్ : ట్విటర్ ను చేజిక్కించుకున్నపటి నుంచి బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ నిత్యం ఏదో ఒక సంచలన రేపుతునే ఉన్నారు. ట్విటర్ కు సంబంధించి ఆయన మరో ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎక్స్ యాప్ తో లీగల్ ఒప్పందం కుదుర్చుకున్న మస్క్ ట్విటర్ లోగో నుంచి పక్షులు మాయం కానున్నాయని సూచన ప్రాయంగా వెల్లడించారు. ట్విటర్ కు సొంత బ్రాండ్ ను తీసుకురావాలని తహతహలాడుతున్నారు. ఆ దిశగా మార్పులు చేర్పులు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. క్రమంగా ఆ దిశగా చర్యలకు ఉపక్రమించనున్నట్లు ఆదివారంనాడు ట్వీట్ చేశారు. మస్క్ ప్రకటనలపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ‘ఈ రోజే ఎక్స్ లోగో పోస్టు చేస్తే… రేపే ప్రపంచ వ్యాప్తంగా లైవ్ లోకి వెళ్లిపోవచ్చు’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *