న్యూాయార్క్ : ప్రపంచంలో ప్రఖ్యాత శాకాహార నిపుణురాలిగా.. ప్రభావశీలిగా పేరుగాంచిన ప్రఖ్యాత ఝాన్నా సమ్సోనోవా కన్నుమూశారు. ఈ 39 సంవత్సరాల సమ్సోనోవా ఆకలితో చనిపోయినట్లు న్యూయార్క్ పోస్టు ప్రకటించింది. నిత్యం ముడి శాకాహార పదార్థాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేసే ఈ సమ్సోనోవా చివరకు ఆకలి చావు చావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆమె మరణవార్త విన్న నెటిజన్లలో భిన్నమైన స్పందన వస్తోంది. ఝాన్నా డీఆర్ట్ ఆన్ లైన్ ఫాలోయర్లు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 21 ఆమె మరణించినట్లు తెలుస్తోంది. సుమారు దశాబ్ద కాలంగా సమ్సోనోవా సంపూర్ణంగా శాకాహార పదార్థాలను మాత్రమే ఆహారంగా తసుకుంటోంది. తద్వారా తన శరీరమంతా ఎముకల గూడుగా కనిపించేలా తయారైంది. కొద్ది నెలల క్రితం శ్రీలంకలో కనిపించిన సమ్సోనోవా ఆరోగ్యం క్షీణించి కనిపించిందని పలువురు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆమెను ఇంటికి పంపించారని, అయినా ఆమె తప్పించుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫుకెట్ లో ఆమెను చూసి భయపడిపోయానని మరో నెటిజన్ తన అనుభవాన్ని వివరించారు. తన స్నేహితురాలు చెబుతున్నదాని ప్రకారం..తాను సమ్సోనోవా పై అంతస్తులో నివసిస్తుంటానని, ప్రతి రోజు తనను చూస్తుంటానని, జీవం లేని తన శరీరాన్ని చూసి భయపడిపోయేదానినని, తనకు ఎంత చెప్పినా చికిత్స తీసుకోకుండా వినిపించుకోలేదని, చివరికి తన ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక సమ్సోనోవా మాత్రం తన కూతురు కలరా తరహా ఇన్ఫెక్షన్ సోకి మరణించిందని ప్రకటించడం గమనార్హం. ఇదిలావుండగా ఆమె అనుభవం పలువురికి పాఠంగా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *