పారిస్ : మరో చారిత్రక సందర్భం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. లీజియన్ ఆప్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫ్రాన్స్ లో ఇది అత్యున్నత పౌర మరియు మిలిటరీ అవార్డు కావడం విశేషం. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. ఇంతటి గౌరవాన్ని తనకు అందించిన ఫ్రెంచ్ అధ్యక్షుడికి భారత ప్రజల తరపున ప్రధాని మోడీ థ్యాంక్స్ తెలిపారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ప్రఖ్యాత ఎలిసీ
ప్యాలెస్ లో కన్నుల పండువగా సాగింది. అధ్యక్షుడు ప్రైవేట్ డిన్నర్ లో ఈ తంతు సాగిందని భారత విదేశాంగ శాఖ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *