ఖాట్మండూ : నేపాల్ లో టూరిస్టులతో కూడిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసింది. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు ఉన్నారు. హెలికాప్టర్ శకలాలను సహాయక టీమ్ లు గుర్తించాయి. ఐదుగురి శవాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. టూరిస్టులను ఐదుగురు మెక్సికన్ లుగా గుర్తించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే సోలుకుంభ్ జిల్లాలోని లమ్జూరా పర్వత శ్రేణుల్లో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. చెట్టును ఢీకొని హెలికాప్టర్ కూలిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *