వాషింగ్టన్ : అమెరికాలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు వివేక్ రామస్వామి. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా రంగంలోకి దిగాలని గట్టి పట్టుదలతో ఉన్న ఈ భారత సంతతి వ్యక్తి తన పార్టీలో తనతో పోటీపడే ప్రత్యర్థులతో అంతే గట్టిగా తలపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ సహా 8మంది అభ్యర్థులు రిపబ్లికన్ల తరపున తలపడుతున్నారు. బుధవారంనాడు జరిగిన ఓపేన్ డిబేట్ లో ట్రంప్ మినహా వివేక్, నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ చర్చలో అత్యంత ప్రతిభావంతంగా వివేక్ రామస్వామి కనిపించారు. చర్చ ముగిసిన గంటల వ్యవధిలోనే ఆయనకు విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. రూ.3.7కోట్లు విరాళాల రూపంలో అందుకున్నట్లు వివేక్ రామస్వామి ప్రచార ప్రతినిధులు వెల్లడించారు. అదే సమయంలో చర్చ అనంతరం జరిగిన సర్వేలో 28శాతం మంది మద్దతుతో అత్యంత పాపులర్ అభ్యర్థిగా అవతరించారు. 27శాతంతో డిసాంటిస్ ఆయనను అనుసరించారు. ఇక పెన్స్ కు 13శాతం, నిక్కీ హేలీకి 7శాతం మాత్రమే మద్దతుగా నిలిచినట్లు సర్వేలు స్పష్టం చేశాయి. వాల్ స్ర్టీట్ జర్నల్ కూడా వివేక్ పై ప్రశంసలు కురిపించింది. ట్రంప్ కు ప్రత్యర్థిగా తానే మిగులుతానని అంటూనే 21వ శతాబ్దంలో ఆయన అత్యుత్తమ ప్రెసిడెంట్ అని వివేక్ రామస్వామి కొనియాడారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *